యురిలో ఇంటి దొంగలే దేశద్రోహులైన వేళ..

Saturday, September 24th, 2016, 04:33:40 PM IST

lol
జమ్మూకాశ్మీర్ లోని యురి సెక్టార్ లో పాక్ ముష్కరులు 18 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో కొత్త నిజాలు వెలుగు చూస్తున్నాయి.ఎన్ ఐ ఏ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి.యురి ఘటనలో ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు తేలింది. పాక్ నుంచి వచ్చి ఈ దారుణానికి ఒడి కట్టిన ఉగ్రవాదులకు మన దేశ ద్రోహులే సాయం చేశారని తెలుస్తోంది.

ఆర్మీ క్యాంప్ లో సరుకురవాణా కూలీలు,పంబ్లర్ లు, ఎలక్ట్రీషియన్ లుగా పనిచేస్తున్న 40 మంది ప్రైవేటు వ్యక్తుల్లోని కొందరు డబ్బుకు ఆశపడి క్యాంపుకు సంబందించిన పూర్తి సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేయడంతోనే ఇది సాధ్యమైందని తేలింది. వారు సమాచారాన్ని చేరవేయడంతో పాటు గూఢచారులుగా కూడా వ్యవహరించి ఉంటారని తెలుస్తోంది.యురి ఉగ్రదాడికి సంబంధించి ఎన్ ఐ ఏ అధికారులు కొందరు కూలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.