కోడి కత్తి కేసు: ఎన్ ఐ ఏ దూకుడు – సీక్రెట్ ప్లేస్ లో విచారణ..!

Saturday, January 12th, 2019, 09:14:55 PM IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ ఐ ఏ దూకుడు ప్రదర్శిస్తోంది. హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఆదేశాలతో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ కేసును విశాఖపట్నం కోర్టు నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయించింది.అలాగే నిందితుడు శ్రీనివాస్ ను ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి కోరింది. దీంతో ఎన్ఐఏ కోర్టు నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బెజవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల అనంతరం ఎన్ ఐ ఏ అధికారులు నిందితుడిని సీక్రెట్ ప్లేస్ కు తీసుకెళ్లారు, అక్కడే శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.

ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాసరావును అప్పగించే విషయంలో ఎన్ఐఏ కోర్టు పలు కీలక సూచనలు చేసింది. నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, మూడురోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా సూచించింది. నిందితుడు కోరితే అతని లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఎన్ఐఏ కోర్టు ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఈ కేసులో చోటు చేసుకున్న కీలక పరిణామాలు టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి, కేసు వైసీపీకి అనుకూలంగా మారుతోందని వారు ఆరోపిస్తున్నట్టు టీడీపీ కుట్ర ఉన్నట్టు తేలుతోందని భయం మొదలైంది .