మహిళలు స్మోకింగ్ చేసినా, నైట్ షిఫ్ట్ లో ఉద్యోగాలు చేసినా ఇక అంతే..!!

Wednesday, February 8th, 2017, 10:21:33 AM IST


మహిళలు ఉద్యోగాలు చేయడం వ్యతిరేకించ దగ్గ విషయం కాదని, కానీ నైట్ షిఫ్ట్ లో జాబ్ చేసేవారికి మాత్రం ఓ ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. న్యూ యార్క్ లో జరిగిన ఓ సర్వే లో భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు నైట్ షిఫ్ట్ లో ఉద్యోగాలు చేసినా, శారీరక శ్రమ అధికంగా చేసినా వారి సంతానోత్పత్తి పై అధిక ప్రభావం ఉంటుందని సర్వే లో వెల్లడైంది. అమెరికాలోని కొందరు నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించారు.గతంలో అధిక పని చేయడం మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా అనే దిశలో వీరి సర్వే చేయగా ఈసారి షిఫ్ట్ ల వారీగా పని చేసే మహిళలపై అధ్యనం నిర్వహించారు.

వీరిలో శారీరక శ్రమ అధికంగా చేసేవారు, నైట్ షిఫ్ట్ లు అధికంగా చేసేవారిలో అండాల ఉత్పత్తి తక్కువగా ఉంటోందని తేలింది. కాగా ఆ మహిళలకు స్మోకింగ్ అలవాటు ఉంటే వారికి అండాల ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారు, శారీరక శ్రమ అధికంగా చేసేవారు ఆహార నియమాలు సరిగ్గా పాటించాలని కూడా సూచిస్తున్నారు.