హ్యాపీ వెడ్డింగ్ టాక్ : నిహారిక బావుంది కానీ..

Saturday, July 28th, 2018, 02:05:19 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది యువ హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అందరూ కూడా ఎవరి స్టైల్ లో వాళ్లు హిట్స్ అందుకొని ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. ఇకపోతే మెగా డాటర్ నిహారిక కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఆమె నటించిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఈ రోజు విడుదలైంది. టైటిల్ తో సినిమా కాన్సెప్ట్ ఏమిటనేది అందరికి అర్థమైపోయింది. సుమంత్ అశ్విన్ చాలా రోజుల తరువాత కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా పాకెట్ ప్రొడక్షన్ తో కలిపి యూవీ క్రియేషన్స్ సినిమాను రిలీజ్ చేసింది.

ఇకపోతే సినిమా విషయానికి వస్తే.. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా సాగిన ఈ కథలో ఎమోషన్ కూడా ఉంది. అయితే తెరకెక్కించే విధానం ఇంకా కొత్తగా ఉంటే బావుండేది. ఎంచుకున్న పాయింట్ సాధారణంగానే ఉన్న అక్కడక్కడా స్క్రీన్ ప్లే లో దర్శకుడు తన పనితనాన్ని చూపించాడు. కుటుంబనేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా బాగా తెరకెక్కించారు. యువత పెళ్లి సమయంలో ఆలోచించే విధానాన్ని కూడా బాగా చూపించారు. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో కథ బావుంటుంది. కానీ ఆ సన్నివేశాలు అంతగా ఆకట్టుకునే విధంగా లేవు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి కొంతవరకు నచ్చుతుందేమో తెలియదు గాని మాస్ ఆడియెన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది సందేహమే. నిహారిక తన పాత్రకు సరైన న్యాయం చేసింది. సుమంత్ అశ్విన్ నటన కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఇక ప్రముఖ నటుడు నరేష్ – మురళి శర్మ వారి నటనతో సినిమాపై ఆసక్తిని పెంచారు. మొత్తంగా సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కొంతవరకు నచ్చే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments