పెళ్లి పేరుతో కోరిక తీర్చుకుని.. నవాజుద్దీన్ మోసం చేశాడు.. నిహారిక సంచ‌ల‌నం..!

Monday, November 12th, 2018, 03:45:19 PM IST

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన మీ..టూ సెగ బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. నానా పాటేక‌ర్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని.. హాట్‌భామ తనుశ్రీద‌త్తా చేసిన ఆరోప‌ణ‌ల‌తో రాజుకున్న ఈ మీ..టూ ఉద్యమం సెగ తాజాగా బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీని కూడా ట‌చ్ చేసింది. త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి శారిర‌క కోరిక తీరాక న‌వాజుద్దీన్ త‌న‌ని మోసం చేశాడ‌ని.. మాజీ మిస్ ఇండియా నిహారిక సింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

ఇక 2009లో మిస్ లవ్లీ అనే చిత్రంలో నవాజుద్దీన్‌తో కలసి నటించిన‌ప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం కుదిరింద‌ని.. త‌ర‌చూ ఇద్ద‌రం క‌లుస్తుండే వాళ్ళ‌మ‌ని.. ఒక‌రోజు మా ఇంటి ముందు గేట్ వ‌ద్ద నిల‌బ‌డి మెసేజ్ చేయ‌గా.. తాను ఇంట్లోకి ఆహ్వానించాన‌ని.. సిద్ధిఖీ ఇంట్లోకి రాగానే త‌న‌ని కౌగిలించుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, అని చెప్పి త‌న‌ని శారీర‌కంగా లొంగ‌దీసుకున్నాడ‌ని.. అప్ప‌టినుండి త‌ర‌చూ శారీర‌కంగా క‌లుస్తుండేవాళ్ళ‌మ‌ని నిహారిక తెలిపింది.

అయితే కొద్ది రోజుల‌కి నవాజుద్దీన్‌కి త‌న‌తోనే కాకుండా చాలా మంది మ‌హిళ‌ల‌తో సంబంధం ఉంద‌ని తెలిసిందే.. త‌న ఫోన్‌తోనే చాలా మందికి ఫోన్ చేశాడ‌ని.. త‌న‌కు గ‌తంలోనే పెళ్ళైంద‌ని త‌న‌కు తెలియ‌ద‌ని.. త‌న భార్య‌తో వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు గురించి తర్వాత తెలిసిందని.. దీంతో అత‌ని నిజ‌స్వ‌రూపం తెలిశాక.. మోస‌పోయాన‌ని తెలిసి, అత‌న్ని దూరం పెట్టాన‌ని నిహారిక సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. న‌వాజుద్దీన్ లాంటి కామ పిచ్చి ఉన్న మ‌గాళ్ల‌ను తాను ఇంత‌వ‌ర‌కు చూడ‌లేద‌ని, చివ‌రికి ఎలాగోలా అత‌ని బారి నుండి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని నిహారిక సంచ‌ల వ్యాఖ్య‌లు చేసింది. మ‌రి ఈ మాజీ మిస్ ఇండియా వ్యాఖ్య‌ల పై న‌వాజుద్దీన్ ఎలా స్పందిస్తారో చూడాలి.