నిక్యాంక పెళ్లి సంబ‌రాలు

Thursday, December 6th, 2018, 01:58:29 PM IST

పెళ్లిల్లు స్వ‌ర్గంలో జ‌రుగుతాయ‌ని అంటారు. కానీ ఇక్క‌డ భూలోక‌మే స్వ‌ర్గంలా మారింది. అందాల క‌థానాయిక పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా భూలోకాన్నే స్వ‌ర్గ‌లోకంగా మార్చుకుని తాను వ‌ల‌చిన స‌ఖుడిని ప‌రిణ‌య‌మాడింది. విదేశీ చెలికాడు నిక్ జోనాస్‌ని అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లాడింది. ఈనెల 1, 2 తేదీల్లో జ‌రిగిన ఈ పెళ్లి వేడుక ఫోటోలు ప్ర‌స్తుతం ట్రెండింగ్.

దీపిక‌- ర‌ణ‌వీర్ పెళ్లి ఫోటోలు వైర‌ల్ అయిన త‌ర్వాత .. పీసీ- నిక్ పెళ్లి ఫోటోలు వెబ్‌ని హోరెత్తిస్తున్నాయి. ఘ‌డియ ఘ‌డియ‌కో కొత్త ఫోటో ఉర‌క‌లెత్తిస్తున్నాయి. అన్న చందంగా ఇప్ప‌టికే తామ‌ర‌తంప‌ర‌గా బోలెడ‌న్ని ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. వాటిలో కొన్ని క‌ల‌ర్‌ఫుల్‌గా రంజింప‌జేస్తున్నాయి. ముఖ్యంగా పీసీ ఎర్ర మందారం రంగు పెళ్లి దుస్తుల్లో త‌ళ‌త‌ళ‌లాడింది. పెళ్లికొడుకు నిక్ జోనాస్ ట్రెడిష‌న‌ల్ రూపంతో ఆక‌ట్టుకున్నాడు. మొద‌టిరోజు హిందూ సాంప్ర‌దాయంలో పెళ్లాడుకున్న ఈ జంట‌, ఆ మ‌రునాడే క్రిస్టియ‌న్ స్టైల్లో పెళ్లి చేసుకున్నారు. ఇరు సాంప్ర‌దాయాల‌కు సంబంధించిన డిజైన‌ర్ డ్రెస్‌లలో కొత్త జంట మెరిసిపోయి మురిసిపోయారిలా.