2019 ఎన్నిక‌లు.. జ‌గ‌న్‌కు ఒక్క ఓటు కూడా ప‌డ‌దు..ఏపీ హోంమంత్రి సంచ‌ల‌నం..!

Thursday, October 25th, 2018, 08:53:51 AM IST


ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. మ‌రో ఏడు నెల‌ల్లో అక్క‌డ అక్క‌డ శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ఉండ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రి పై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నారు. ఇక తాజ‌గా అధికార టీడీపీ హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ప్ర‌ధాన ప్రధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజ‌గా మీడియా ముందుకు వ‌చ్చిన చిన‌రాజ‌ప్ప మాట్లాడుతూ జ‌గ‌న్ ఇంకో ప‌దేళ్ళు పాద‌యాత్ర చేసినా ముఖ్య‌మంత్రి కాలేడ‌ని చెప్పారు.

ఏపీలో ఒక సామాజిక వ‌ర్గం మొత్తం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని.. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లతో జ‌గ‌న్ పై వారికి పూర్తిగా న‌మ్మ‌కం పోయింద‌ని.. దీంతో ఆ సామాజిక వ‌ర్గం నుండి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఒక్క ఓటు కూడా ప‌డ‌ద‌ని చిన‌రాజ‌ప్ప అన్నారు. ఇక‌ అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై మాత్రం ఆ సామాజిక వ‌ర్గానికి మంచి అభిప్రాయ‌మే ఉంద‌ని.. ఇప్ప‌టికి వ‌ర‌కు ఆ సామాజిక వ‌ర్గ కార్పోరేష‌న్ కోసం చంద్ర‌బాబు దాదాపు మూడువేల కోట్లు ఖ‌ర్చు చేశార‌ని.. మ‌రి అలాంట‌ప్పుడు వారంతా చంద్ర‌బాబుకే ఓట్లు వేస్తార‌ని చిన‌రాజ‌ప్ప అన్నారు. దీంతో చిన‌రాజ‌ప్ప వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణుల ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments