రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన నిమ్రత్ కౌర్!

Tuesday, September 4th, 2018, 10:21:53 AM IST

రీసెంట్ గా టీమిండియా కోచ్ రవిశాస్త్రి బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా మీడియాల్లో ఈ రూమర్స్ వస్తున్నప్పటికీ ఇద్దరి సెలబ్రెటీల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అంతా నిజమని అనుకున్నారు. అయితే ఇప్పుడు అంతా నిజమని నమ్మే సమయానికి నిమ్రత కౌర్ రూమర్స్ చెక్ పెట్టె ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై తనదైన శైలిలో స్పందించింది.

తన గురించి ఇటీవల వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని అవి నన్ను చాలా బాధకు గురి చేశాయని అమ్మడు వివరణ ఇచ్చింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిమ్రత్ కొన్నేళ్ల క్రితం ఒక కార్ల కంపెనీకి సంబందించిన ప్రమోషన్ లో పాల్గొంది. అయితే రవిశాస్త్రి కూడా అదే కంపెనీకి సహా ప్రచారకర్తగా బాధ్యతలు తీసుకోగా అప్పుడు నిమ్రతతో పరిచయం ఏర్పడింది. దీంతో అప్పుడే వారి మధ్య ప్రేమ ఏర్పడిందని రూమర్స్ మొదలయ్యాయి. దానికి తోడు రవిశాస్త్రి విడాకులు తీసుకున్నాడని కూడా టాక్ రావడంతో నిమ్రత కోసమే రవిశాస్త్రి ఆ విధంగా చేశారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

  •  
  •  
  •  
  •  

Comments