నిఫా వైరస్ కు బయపడకండి… వైద్యుల సలహాలు

Saturday, May 26th, 2018, 01:18:27 PM IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిఫా వైరస్ కు సంబందించిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రపంచ దేశాలు కూడా భారత్ లో మొదలైన ఆ వ్యాధి గురించి తెలుసుకొని అలెర్ట్ అయ్యాయి. ఒక మనిషి నుంచి మరో మనిషికి తొందరగే సోకె వ్యాధి కావడంతో దేశం నుంచి మరో దేశానికి వెళ్లే వారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల్లో కూడా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇకపోతే వైరస్ కు భయపడవద్దని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం కేరళ ప్రాంతంలో కొంత మంది ఆ వ్యాధి భారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ నర్సు కూడా రోగులకు సేవలు అందిస్తూ వ్యాధి భారిన పడి మృతి చెందింది. జంతువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది. వైరస్ ఉన్న పందులు గబ్బిలాల విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు చుట్టూ పక్కల శుభ్రత ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. అన్నం తినే ముందు కాళ్ళు చేతులు పరి శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాధి భారిన పడిన వారిని గుర్తించే లక్షణాలు.. వళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, శ్వాసకోస ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్ లో చేర్చాలని వైద్యులు సూచిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments