కోల్ కతా లో దర్శనమిచ్చిన నిఫా వైరస్!

Wednesday, May 30th, 2018, 05:30:39 PM IST

ప్రస్తుతం దేశమంతా నిఫా వైరస్ భయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రాలన్నీటీలో వైద్యులను అలెర్ట్ చేశారు. ప్రతి ఆసుపత్రిలో నిఫా ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారిన నిఫా ఇప్పటికే 13 మంది ప్రాణాలను బలిగొంది. ఇంకా ఆ వైరస్ భారిన పడిన మరికొంత మందికి ప్రత్యేక ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నారు. దీంతో సమీప రాష్ట్రాల ప్రభుత్వాలు కేరళకు బర్దార్స్ గా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వారిపై ఓ కన్నేసి ఉంచారు.

అయితే ఊహించని విధంగా నిఫా కోల్ కతా లో దర్శనమిచ్చింది. కేరళకు చెందిన ఓ సైనికుడు ఇటీవల కోల్ కతా లోని ఒక ఆసుపత్రిలో మృతి చెందాడు. ప్రసాద్ అనే యువకుడు ఇటీవల కొంచెం అస్వస్థకు గురయ్యాడు. అతను ఫోర్ట్‌ విలియం కోటలో పని చేస్తుంటాడు. అయితే అస్వస్థకు గురైన ఆ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. 10 రోజులగా వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి మృతి చెందడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో భయం నెలకొంది. చిన్న అస్వస్థకు గురైన వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ఇక ప్రసాద్ శాంపుల్స్ ని పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి వ్యాధి నిర్ధారణ కోసం పంపారు. ఇండియాలో ఈ వ్యాధి నిర్దారణ కోసం ఉన్న ఏకైక ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments