భయపెడుతోన్న నిపా వైరస్‌.. నర్స్ చివరి మాటలు!

Tuesday, May 22nd, 2018, 06:58:55 PM IST

ప్రపంచంలో కొత్త కొత్త వైరస్ లు మనిషి జీవితాన్ని ఊహించని విధంగా దెబ్బ తీస్తున్నాయి. ఇటీవల నిపా వైరస్‌ దేశమంతా సంచలనంగా మారింది. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో అంతూ చిక్కడం లేదు. ఇకపోతే ఇటీవల ఆ వైరస్ భారిన పడి లినీ(31) నర్సు మరణించగా ఆ న్యూస్ వైరల్ గా మారింది. ఆమె బ్రతకాదని ఆమెకు తెలియగానే కుటుంబ సబ్యులకు ఒక లేఖ ద్వారా తన చివరి సందేశాన్ని భర్తకు అందించింది.

నేను మరణిస్తున్నానని నాకు తెలుసు. అలాగే నిన్ను కలుసుకునే సమయం కూడా నాకు లేదు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. అవసరం అయితే నీతో పాటే పిల్లల్ని గల్ఫ్ కి తీసుకువెళ్లు. నేను లేను అని మా నాన్న లనే జీవితాంతం ఒంటరిగా ఉండకని లీని చనిపోయే కొన్ని గంటల ముందు చివరి మాటలని భర్తకు చేరవేసింది. చివరికి ఆమె దహన సంస్కారాలకు కూడా కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు. ఎవరైనా ఆమెను ఆ మూమెంట్ లో తాకితే వారికి కూడా వ్యాధి సోకె అవకాశం ఉందని ఎవరిని రానివ్వలేదు. ప్రస్తుతం కేరళలో నిపా వైరస్‌ సోకిన కొంత మందికి వైద్యం అందిస్తున్నారు. అందులో ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments