బ్రాండ్ పై దెబ్బ కొట్టింది.. అప్పు ఎలా కట్టాలి?

Wednesday, February 21st, 2018, 02:00:11 AM IST

ఇటీవల పంజాబ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ భయటపెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కుంభకోణం దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే దేశం విడిచి వెళ్లిపోయిన నీరవ్ రీసెంట్ గా బ్యాంకుకు లేఖ రాశారు. మొత్తంగా నా బ్రాండ్ ను బ్యాంక్ నాశనం చేసింది. వారి కారణంగా చాలా నష్టాలను చూడాల్సి వచ్చింది. బ్యాంకుకు అప్పు చెల్లించాలని అనుకున్నా వారి వల్ల అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే బ్యాంక్ తనపై ఎక్కువగా తప్పుడు ఆరోపణలు చేసిందని చెబుతూ.. వారు చెబుతున్న దానికంటే తక్కువగానే ఇవ్వాలని తెలిపాడు.

ఇక ఫిబ్రవరి 14న బ్యాంక్ రూ.11,400కోట్ల భారీ మోసాన్ని బయటపెట్టింది. అయితే ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీల మధ్య నీరవ్‌ మోదీకి, బ్యాంకు అధికారులకు మధ్య ఈమెయిల్స్‌ ద్వారా చర్చ జరిగింది. కుంభకోణ విషయాన్నీ బయటపెట్టిన తరువాత నీరవ్ కి అప్పులు కట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. బ్యాంక్ అధికారులు మాత్రం దాదాపు వారి వల్ల 11వేల కోట్ల వరకు నష్టపోయామని చెబుతోంది. అయితే నిరవ్ తనకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిస్తోంది. బ్యాంక్ సహాయం చేస్తేనే అప్పు తీర్చడానికి వీలుగా ఉంటుందని చెప్పాడు. నా ఆస్తుల విలువ 6,500కోట్లు ఉంటుంది. వాటి ద్వారా కొంత తీర్చగలను అని నిరవ్ తెలిపాడు. ఇక ఈ స్కామ్ లో తన కుటుంబాలకు ఎటువంటి సంబంధం లేదని నిరవ్ వివరించారు.