పవన్ కళ్యాణ్ జాతి వ్యతిరేకి ?

Sunday, January 29th, 2017, 02:29:48 PM IST

pawan
కేంద్ర మంత్రి , తెలుగింటి ఆడ బిడ్డ నిర్మలా సీతారామన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఆమె మోడీ కి ఎవరైనా వ్యతిరకంగా మాట్లాడారు అంటే వారు జాతికి వ్యతిరేకులే అంటున్నారు. ఆమె కొత్త రకమైన వాదన ని తెరమీదకి తీసుకుని రావడం ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. జల్లికట్టు బీజేపీ ఎంత అనుకూలంగా ఉంది అనేది ఆమె చెప్పుకొచ్చారు.
‘‘జల్లికట్టు ఉద్యమంలో కొంతమంది ప్రధానికి.. బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రధానిగా ఎవరు ఆ పదవిలో ఉన్నా.. వారికి వ్యతిరేకంగా మాట్లాడే వారంతా జాతి వ్యతిరేకులే’’ అంటూ చిత్రమైన వాదనను చేశారు. ఒకవేళ అదే నిజమైతే.. ప్రధానిగా మన్మోహన్ ఉన్నప్పుడు ఆయన్ను.. ఆయన సర్కారుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బేజేపీ నేతల్లో సీతారామన్ ఒకరు. వరుస పెట్టి టీవీ చర్చల్లో యూపీఏ సర్కారుపైనా.. మన్మోహన్ తీరుపైనా విమర్శలు చేసినందుకే ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కిన విషయాన్ని మర్చిపోకూడదు. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ తెల్లారితే కేంద్రం మీద సీరియస్ అయిపోతున్నారు సో ఆయన మోడీ ని ఏమన్నా కూడా ఆయన జాతి వ్యతిరేకి అవుతాడా ?