స్టోరీ సూపర్ అంట..నితిన్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరంటే..!

Wednesday, October 25th, 2017, 07:19:56 PM IST

ఎంతో కష్టపడ్డా లై చిత్ర రిజల్ట్ నితిన్ ని నిరాశపరిచింది. మంచి అంచనాలతో విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది. కాగా నితిన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల నిర్మణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటిస్తున్నాడు. నితిన్ నటించబోయే తదుపరి చిత్రం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. రాజా ది గ్రేట్ చిత్రంతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో నితిన్ నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి వివరించిన కథ నితిన్ కే కాదు ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి కి కూడా తెగ నచ్చేయడంతో సొంత నిర్మాణంలో చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నితిన్ భావిస్తున్నాడు. పటాస్, సుప్రీం మరియు రాజా ది గ్రేట్ వంటి చిత్రాలతో వినోదాత్మక చిత్రాలని తెరకెక్కించగల దర్శకుడిగా అనిల్ రావిపూడి గుర్తింపు తెచ్చుకున్నాడు.