నాగ చైతన్యతో ఆ హీరోయిన్ – కరెక్ట్ జోడీయేనా..?

Wednesday, December 5th, 2018, 06:00:17 PM IST

నాగచైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ అనే చిత్రంలో నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు చైతు. వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ తో ఆకట్టుకున్న మేర్లపాక తర్వాత వచ్చిన కృష్ణార్జున యుద్ధంతో నిరాశ పరిచాడు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో నాగ చైతన్యకు మంచి హిట్ అత్యవసరం, ఇలాంటి పరిస్థితుల్లో స్వతహాగా మంచి కథకుడైన మేర్లపాక చైతూకు ఏ మేరకు హిట్ అందిస్తాడో అన్నది సందేహంగా మారింది.

ఈ సినిమా విషయంలో తాజగా వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏమనగా, చైతూ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోందట, దాదాపు ఆమె అంగీకరించినట్లే అన్న వార్తలొస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, నిత్యామీనన్ హీరోయిన్ గా చేసిన పెద్ద సినిమాల్లో ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు, సెకండ్ హీరోయిన్ గా చేసిన సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు తప్ప. మరి తప్పనిసరిగా పెద్ద హిట్ అవసరమైన పరిస్థితిలో ఉన్న చైతూకు నిత్యామీనన్ తో జోడి కట్టడం ఎంతవరకు లాభిస్తుందో వేచి చూడాలి.