ఐశ్వర్య రాయ్ ఐటమ్ సాంగ్ చేయడంలేదు – భన్సాలీ

Saturday, August 10th, 2013, 04:09:06 PM IST

ఐశ్వర్యరాయ్ ఆరాధ్య జన్మించిన తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే తను త్వరలోనే ‘రామ్ లీలా’ సినిమాతో తిరిగి సినిమాలలో నటించనుందని ఆ సినిమాలో తను ఒక ఐటమ్ చేయనుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ కి ‘రామ్ లీలా’ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తో కలిసి ‘దేవదాస్’, ‘గుజారీష్’ సినిమాలలో నటించింది. అయితే వారి మద్య వున్న సన్నిహితం వల్ల భన్సాలీ అడగ్గానే ఆమె ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో తాజాగా ఈ సినిమా దర్శకుడు భన్సాలీ తన సినిమాలో ఐశ్వర్యరాయ్ ఐటమ్ సాంగ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. అలాగే అయన మాట్లాడుతూ ‘మొదట సొనాక్షి సిన్హా అని, ఆ తరువాత మాదురీ దీక్షిత్ అని అన్నారు. ఇప్పుడు ఐశ్వర్యరేయ్ అంటున్నారు. అసలు ఇలాంటి ప్రచారాలు ఎలా వస్తాయో అర్థం కావడంలేదు’ అని అన్నారు.

అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం తన పూర్తి సమయాన్ని తన కూతురు ఆరాధ్యతోనే గడుపుతోంది. తనకు ఆరాధ్య కన్నా ఏది ఎక్కువకాదని అంటోంది. అయితే మంచి కథ దొరికితే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని అంటోంది. అయితే తను 1983లో వచ్చిన ‘మనూమ్’ సినిమా రీమేక్ లో నటించడానికి సంతకం చేసిందని సమాచారం.