తూచ్.. తూచ్ .. జైలు శిక్ష లేదు..జస్ట్ జరిమానా..!

Friday, December 30th, 2016, 12:55:20 AM IST

money
మార్చ్ 31 తరువాత పాత రూ 500, రూ 1000 నోట్లని కలిగి ఉంటే జైలు శిక్షని విధిస్తాం అని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఆర్డినెన్సుని జారీచేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతలోనే ఈ ప్రతిపాదనలో కేంద్రం సవరణలు చేసింది.రద్దయిన నోట్లని మార్చి 31 తరువాత కలిగి కలిగి ఉంటే రూ 10 వేల కనీస జరిమానా, జైలు శిక్ష కూడా విధిస్తామని కేంద్రం ప్రకటించింది.

కానీ అంతలోనే జైలు లేదని కేవలం జరిమానా మాత్రమే అని సవరణలను చేసింది. తాజా సవరణల ప్రకారం రద్దయిన నోట్లను రూ 10 వేలు అంత కన్నా ఎక్కువ కలిగి ఉన్నా, వాటిని స్వీకరించినా బదిలీ చేసినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారని కేంద్రం తాజా ప్రకటనలో పేర్కొంది. ఒక వ్యక్తివద్ద గరిష్టంగా 10 లోపు పాతనోట్లనే అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ కలిగి ఉంటే క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు.

  •  
  •  
  •  
  •  

Comments