కొండగట్టు ప్రమాద బాధితులని ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు.?

Friday, October 12th, 2018, 09:00:08 PM IST

నెల రోజుల క్రితం తెలంగాణా రాష్ట్రం జగిత్యాల జిల్లా,కొండగట్టు ప్రాంతం లో చోటు చేసుకున్నటువంటి రోడ్డు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికి తెలుసు.దాదాపు 60 మంది ప్రాణాలు తృణ ప్రాయంలో గాల్లో కలిసిపోయాయి.జరిగినది చిన్న తప్పిదమో లేక పెద్ద తప్పిదమో ప్రమాదం మాత్రం కోలుకోలేని స్థాయిలో జరిగింది.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి ప్రభుత్వ నాయకులు అందరూ అక్కడికి చేరుకొని క్షత గాత్రులకు వారి కుటుంబాలకు వారి ప్రఘాడ సానుభూతిని తెలిపి తగిన నష్ట పరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ హామీలు ఇచ్చి నెలనాళ్ళు కావస్తున్నా సరే క్షతగాత్రులకు వారి కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందలేదని వారు ఇప్పుడు వాపోతున్నారు.దీనికి కారణం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్లన ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇంకా వారికీ అందలేదని తెలుస్తుంది.దీనితో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.వీలైనంత త్వరగా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చెయ్యాలని కెసిఆర్ సర్కార్ ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలుస్తుంది.దీనితో వారు ఎన్నికల కోడ్ పై సమాలోచనలు చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.