ఏంటి యువరాజ్ నీకే ఇలా జరుగుతుంది..?

Wednesday, December 19th, 2018, 12:42:21 AM IST

టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ లలో లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా ఒకరు అతని ఆట తీరు అంటే అతని అభిమానులు పడి చచ్చిపోతారు.భారత జట్టులో యువరాజ్ ఒక కీలక పాత్ర పోషించారు.కానీ గత కొంత కాలంగా మాత్రం యువరాజ్ కు గడ్డు కాలమే నడుస్తుందని చెప్పాలి.ఆ మధ్య తన వీరోచిత పోరాటంతో యువీ ఈస్ బ్యాక్ అని అనిపించుకున్నారు.కానీ అది ఎంతో కాలం నిలుపుకోలేకపోయారు.

అది అలా పక్కన ఉంచినా గత ఐపీఎల్ మ్యాచుల్లో అయినా సరే పాత రోజుల్లా మెరుపులు మెరిపిస్తారనుకున్నా సరే తన అభిమానులకు చేదు అనుభవమే మిగిలింది అని చెప్పాలి.ఇప్పుడు ఆ ప్రభావమే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ మ్యాచులకు గాను యువీ మీద గట్టిగానే పడింది.ఈ రోజు జైపూర్ లో ఆటగాళ్ల వేలం నడుస్తుండగా అన్ని జట్ల యజమానులు పాల్గొన్నారు.అయితే ఎన్ని రౌండ్లు ముగుస్తున్నా సరే యువరాజ్ ను కొనేందుకు మాత్రం ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు,దీనితో వచ్చే ఐపీఎల్ లో మాత్రం యువరాజ్ ని చూడలేమనే చెప్పాలి.