జనం లేక వెలె వెలబోతున్న “వినయ విధేయ రామ” థియేటర్లు..!

Friday, January 11th, 2019, 07:05:47 AM IST


ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఒక అనువాద చిత్రంతో పాటు మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ఈ రోజుతో రెండు సినిమాలు విడుదలయ్యిపోయాయి.అయితే మాములుగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే సినీ అభిమానులకు మరో పండగే అని చెప్పాలి.థియేటర్లకు తమ అభిమాన నటుని సినిమా చూసేందుకు ఒక్కొక్కరు క్యూ లు కడతారు.అయితే ఈ సారి పండుగ సీజన్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనే చెప్పాలి.

అందులోను ఈ రోజు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ” సినిమా పరిస్థితి అయితే మరీ దారుణంగా కనిపిస్తుంది.భాగ్యనగరం కూకట్ పల్లి,విశ్వనాథ్ థియేటర్లో ఈ సినిమా చూసేందుకు అసలు జనమే కరువయ్యిపోయారు.అక్కడ బెనిఫిట్ షో ఒక గంట ఆలస్యం కావడం అందులోను టికెట్ రేటు 2000 నుంచి 2500 పెట్టడంతో ఈ సినిమా చూసేందుకు ఎవరు ముందుకు రాలేదు.దీనితో థియేటర్ నిండుకోలేదు.ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఇక్కడే అనుకుంటే ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొందని తెలుస్తుంది.ఇలా అయితే సినిమాకి పెద్ద దెబ్బే అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.