మరెవరూ బాధపడకూడదు : బాలకృష్ణ

Sunday, October 19th, 2014, 06:52:59 PM IST

balakrishna1

తన తల్లి క్యాన్సర్ కారణంగా ఎంతో బాధపడ్డారని, ఆ బాధ మరెవరికి రాకూడదనే ఉద్దేశ్యంతో బసవతాకరం క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించామని సినీహీరో, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం అన్నారు. రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేబీఆర్ పార్క్ నుండి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వరకు నిర్వహించిన రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన నడకను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, నటి హేమ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. తన తల్లి క్యాన్సర్ కారణంగా ఎంతో బాధపడ్డారని, ఆ బాధ మరెవరూ పడకూడదన్న ఉద్దేశంతోనే క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించామన్నారు. ఈ ఆసుపత్రిని ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దుతామన్నారు బాలకృష్ణ స్పష్టం చేశారు. పేదలకు ఉచిత చికిత్స అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను రాకుండా చేసుకోవచ్చునని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలియజేశారు.