జల్లికట్టు కు, స్పెషల్ స్టేటస్ కు తేడా అక్కడే వచ్చింది..!

Thursday, January 26th, 2017, 03:20:56 PM IST

jelllli
తమిళులు జల్లికట్టు నిరసనల స్ఫూర్తి నుంచి ఆంధ్ర స్పెషల్ స్టేటస్ ఉద్యమం మరో సారి జీవం పోసుకుంది.ఏపీ యూత్ తలపెట్టిన స్పెషల్ స్టేటస్ మౌన దీక్షకు సోషల్ మీడియాలో పెద్ద యెత్తున ప్రచారం లభించింది.నేడు విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం ముందుగానే సిద్ధమైపోయింది.జగన్, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఈ మౌన దీక్షకు మద్దత్తు తెలపడంతో దీనికి మరింత బాగా ప్రచారం కలిగిందని చెప్పాలి.కానీ దీనిని అణచివేయడానికి ఏపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కారుల అరెస్టులు జరుగుతున్నాయి.జల్లికట్టు ఉద్యమానికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అనూహ్యమైన మద్దత్తు లభించింది.జల్లికట్టు ఉద్యమం చివర్లో హింసాత్మకమగా మారింది. ఆవిషయం పక్కనపెడితే కేంద్రం దిగివచ్చి తాత్కాలికంగా జల్లికట్టు కు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ చేసేంతవరకు శాంతియుత వాతావరణంలోనే ఉద్యమం జరిగింది.సినీ పరిశ్రమలో రజినీకాంత్, అజిత్ వంటి స్టార్ హీరోలే జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్నారు.

కానీ దాని నుంచి స్ఫూర్తిని పొందిన స్పెషల్ స్టేటస్ ఉద్యమానికి మాత్రం టాలీవుడ్ సినీతారల మద్దత్తు కరువైందనే చెప్పాలి. కొంతమంది హీరోలు మద్దత్తు ప్రకటించినా వారి స్టేట్మెంట్స్ సోషల్ మీడియా కు మాత్రమే పరిమితమయ్యాయి.ఈ విషయం లో మొదట సంపూర్ణేష్ బాబునే అభినందించాలి. ఏపీ స్పెషల్ స్టేటస్ కు పూర్తి మద్దత్తు ప్రకటించిన సంపూర్ణేష్ బాబు స్వయంగా విశాఖలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్నాడు. సంపూర్ణేష్ బాబుని పోలీస్ లు అరెస్ట్ చేసారు కూడా. సంపూర్ణేష్ బాబు తప్ప టాలీవుడ్ నుంచి ఏ హీరో కూడా పాల్గొనలేదు.ఏపీ యువత ప్రత్యేక హోదా ఉద్యమానికి అధికార టిడిపి, బిజెపి పార్టీ లు పూర్తి వ్యతిరేకంగా ఉండడం, జనసేన , వైసిపి కార్యకర్తల మద్దత్తుని పోలీస్ లు నిర్వీర్యం చేసి అరెస్టులు చేస్తుండడంతో మౌన దీక్ష అనుకున్నంత విజయం సాధించలేదని విశ్లేషకులు అంటున్నారు.