టాక్స్ ఎగ్గొట్టిన సానియా ? ఆ డబ్బు కెసిఆర్ ఇచ్చారు అంటోంది !

Saturday, February 18th, 2017, 02:55:27 AM IST


అప్పట్లో వార్తల్లో ఎక్కువగా ఉంటూ ఉండే టెన్నీస్ దిగ్గజం సానియా మిర్జా ఇప్పుడు మళ్ళీ న్యూస్ లో కనిపిస్తోంది. ఆమె మీద టాక్స్ ఎగ్గొట్టింది అంటూ వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. సానియా మిర్జా కీ ఇంకం టాక్స్ ఆఫీసర్ లకీ మధ్య వాగ్వాదం జరిగింది అనీ ఆమె టాక్స్ కట్టకపోవడమే దీనికి కారణం అంటూ వార్తలు వచ్చాయి.వివరణ ఇచ్చేందుకు తమ ముందు సానియా లేదా ఆమె అకౌంటెంట్ హాజరు కావాలన్ని సర్వీస్ ట్యాక్స్ అధికారుల పిలుపుపై హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తాను సేవాపన్నులు ఎగ్గొట్టలేదన్నారు. రిటర్న్స్ లో చూపించిన కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ట్రైనింగ్ ప్రోత్సాహకం కింద ఇచ్చిందని తెలిపింది. ఆ డబ్బును తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు వచ్చిన నజరానా కాదని ఆమె స్పష్టం చేసింది. సానియా ప్రకటనను తెలంగాణ క్రీడాశాఖాధికారులు ధ్రువీకరించారు.