జియో దెబ్బకి నోకియా కూడా మారిందే!

Friday, July 6th, 2018, 06:19:39 PM IST

జియో దెబ్బకు దేశంలో ఒక్కసారిగా టెలికామ్ రంగంలో బారి మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ వాడకం అనేది ఇప్పుడు సర్వసాధారణమైంది. ఎలాంటి ఫోన్ లో అయినా కూడా యూ ట్యూబ్ వాట్సాప్ ఫెస్ బుక్ యాప్ లను అందుబాటిలో ఉంచుతున్నాయి ఆయా కంపెనీలు. జియో మొబైల్ లో మొదటి సారి ఆ ప్రణాలిక సక్సెస్ అవ్వగా నోకియా కూడా అదే బాట పట్టింది. మోడల్ 8110 4జీ లో వాట్సాప్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్ల అధిపతి హెచ్‌ఎండీ గ్లోబల్‌ టీజ్‌చేసింది. కిఓఎస్‌లో వాట్సాప్‌. ‘బనానా’స్‌లోకి వెళ్లడానికి చూస్తోంది’ అంటూ హెచ్‌ఎండీ గ్లోబల్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ జుహో సర్వికాస్‌ సోషల్ మీడియా ద్వారా ట్వీట్‌ చేశారు.

నోకియా 8110 4జీ ఫీచర్లు…

512 ఎంబీ ర్యామ్‌
2 ఎంపీ రియర్‌ కెమెరా
1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మరింత విస్తరణ
డ్యూయల్‌ సిమ్‌
కిఓఎస్‌ ఆధారిత స్మార్ట్‌ ఫీచర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
క్యూవీజీఏ డిస్‌ప్లే 2.45 అంగుళాల
1.1 గిగాహెడ్జ్‌ డ్యూయల్‌-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 205 ప్రాసెసర్‌
4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌