సుప్రీమ్ కోర్టు నిర్ణయం.. హింసాత్మకమైన బంద్!

Tuesday, April 3rd, 2018, 03:36:17 AM IST

సుప్రీం కోర్టు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్య ప్రదేశ్ – పంజాబ్ , గుజరాత్ – రాజస్థాన్ అలాగే బీహార్ రాష్ట్రాల్లో దళిత సంఘాలు చేపట్టిన ఆందోళనలకు అలజడులు నెలకొన్నాయి. పోలీసులువు ముందుగానే చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితిని అదుపు చేయలేని పరిస్థితి వచ్చింది. కర్ఫ్యూ విధించినా కూడా ఆందోళనలు తగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఈ అలజడులు నెలకొన్నాయి. తీర్పును వ్యతిరేకిస్తూ దళిత కమిటీలు దేశవ్యాప్తంగా బంద్ ను ప్రకటించాయి.

కొన్ని చోట్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రాణ నష్టం కూడా జరిగింది. మధ్య ప్రదేశ్ లో పోలీసులకు దళితులకు జరిగిన ఘర్షణలో నలుగురు మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. ఎస్సి ఎస్టీ వర్గాలకు చెందిన వారిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారిని వెంటనే అరెస్ట్ చేయకూడదు అని సుప్రీం కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. అందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం చాలానే పడింది. ప్రభుత్వ ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది. ప్రభుత్వ బస్సులను తగలబెట్టారు. కొన్ని చోట్ల రైళ్లను కూడా అడ్డుకున్నారు. దీంతో చాలా వరకు పోలీసుల అదుపులోకి రాకపోవడంతో ఆర్మీని రంగంలోకి దింపాల్సి వచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments