బిగ్ షాక్‌ : 2ఏళ్లు కాదు, 5ఏళ్ల జైలు!

Thursday, April 5th, 2018, 03:10:31 PM IST

ఇది నిజంగానే బిగ్ షాక్‌! వంద‌ల‌, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం తుళ్లిప‌డేంత బిగ్ షాక్ అనే చెప్పాలి. కండ‌ల‌హీరో స‌ల్మాన్ భాయ్‌కి ఐదేళ్ల జైలు శిక్ష‌ను ఖ‌రారు చేస్తూ జోధ్‌పూర్ కోర్టు వెలువ‌రించిన తీర్పు సంచ‌ల‌న‌మైంది. తొలుత స‌ల్మాన్‌కి రెండేళ్ల జైలు, దాంతో పాటే రూ.10వేలు ఫైన్‌ విధిస్తూ తీర్పు వెలువ‌డింద‌ని జాతీయ మీడియానే క‌న్ఫ్యూజ్ చేసింది. కానీ చివ‌రికి ఆ శిక్ష ఐదేళ్ల‌కు ఖ‌రారైన‌ట్టు తుది ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

కృష్ణ జింక ఇప్పుడు స‌ల్మాన్‌ని వేటాడింది. అత‌డి చేతిలో ఉన్న వంద‌ల‌, వేల‌కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల‌న్నిటినీ వేటాడింది. త‌ప్పు చేస్తే ఎంత పెద్ద సెల‌బ్రిటీకి అయినా భార‌తీయ శిక్షాస్మృతిలో శిక్ష త‌ప్ప‌దని ప్రూవైంది. ఈ సంచ‌ల‌న తీర్పుతో ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మ‌స‌లుకోవాల‌ని సెల‌బ్రిటీల‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్టే అయ్యింది. 1998 కృష్ణ జింక‌ల వేట కేసు నేటితో ప‌రిస‌మాప్తం అయిన‌ట్టేన‌ని భావించ‌డానికి వీళ్లేదు. త‌దుప‌రి సెష‌న్స్ కోర్టు తీర్పును వ్య‌తిరేకిస్తూ, రాజ‌స్థాన్ హైకోర్టులో అప్పీల్ కోసం స‌ల్మాన్ సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది.