బ్రేకింగ్ : ఎగ్జిట్ పోల్స్ కాదు..బయటకొచ్చిన రోజా సంచలన సర్వే రిపోర్ట్..!

Tuesday, May 21st, 2019, 11:15:52 AM IST

ఇంకా ఏపీ రాజకీయాలకు సంబంధించి అసలు ఫలితాలు రాక ముందే ఇక్కడి రాజకీయ వర్గాల్లో ఒక రకమైన ఉత్కంఠతో పాటు ఆసక్తికర వాతావరణం నెలకొంది.ఇప్పటికే అనేక సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు బయటకొచ్చి ఏపీ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్నాయి.అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి టీడీపీ మరియు వైసీపీ పార్టీలపై వారి పార్టీ నేతలతో సహా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ ను అటుంచితే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ప్రముఖ సినీ నటి రోజా కూడా ఓ సర్వే నిర్వహించారట.

ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్ సర్వేలాంటిది కాదని ప్రత్యక్షంగా ప్రజల నాడి తెలుకొని నిర్వహించామని తెలిపారట.ఈ సర్వేలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతా జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అందుకు ప్రతిఫలంగా వైసీపీకి మొత్తం 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు అలాగే 22 నుంచి 23 ఎంపీ స్థానాలు రావడం ఖాయమని తేలిందని చెప్పారట.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా మరియు వైసీపీ శ్రేణుల్లో ఊపందుకుంది.మరి ఈ సర్వే రిపోర్టులు ఎంత వరకు నిజం కాబోతున్నాయో చూడాలి.