వైసీపీకి మరో షాక్..జగన్ పై దాడికి ఒకటి కాదు రెండు కత్తులు..!

Friday, October 26th, 2018, 06:31:42 PM IST

నిన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసినదే..ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి పోలీసులు వెంటనే నిందితుడిని వారి అదుపులోకి తీసుకున్న సంగతి కూడా తెలిసినదే..అయితే శ్రీనివాస్ ను విశాఖ పోలీసులు విచారించి అక్కడి సెషన్స్ కోర్టులో ఈ రోజు హాజరు పరిచినట్టు తెలుస్తుంది.ఈ విచారణలో ఈ కేసు మరో కొత్త కోణంలోకి వెళ్ళింది అని అక్కడి పోలీసులు తెలిపారు.నిజానికి శ్రీనివాస్ జగన్ పై దాడికి ఒక కత్తి కాదని రెండు కత్తులు తెచుకున్నాడని వెల్లడించారు.

ఒకటేమో దాడికి పాల్పడిన 8 సెంటీమీటర్ల మేర కత్తి మరొకటి ఏమో అదే స్థాయిలో ఉండే చిన్న కత్తి కూడా అతని దగ్గర దొరికాయని తెలుస్తుంది.అంతే కాకుండా శ్రీనివాస్ దగ్గర కత్తులు లేఖలతో పాటు మరి కొన్ని వేరే ఏవో జెరాక్స్ కాపీలు కూడా దొరికాయని వెల్లడించారు.నిందితుడిని మరి కొన్ని రోజులు విచారించాలని అక్కడి న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.కోర్టు యొక్క ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి వివరాలను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తామని విశాఖ పోలీసులు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments