బ్యాట్ తోనే కాదు మాటలతో కూడా సెహ్వాగ్ దూకుడు !

Tuesday, February 6th, 2018, 01:30:42 PM IST

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ట్విట్టర్ లో తన వ్యక్తిగత అభిప్రాయాలతో మాటల్లోనూ దూసుకెళ్లే ఈ ఆటగాడు ప్రస్తుతం ఒక ట్వీట్ తో పెను సంచలనమే సృష్టిస్తున్నారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో అంపైర్ల లంచ్ బ్రేక్ నిర్ణయంపై పలు విధాలుగా జోకులు, విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ విషయాన్ని బ్యాంక్ ఉద్యోగులకు లింక్ చేసి సెహ్వాగ్ ఒక ట్విట్ చేశారు. వాస్తవానికి మరో రెండు పరుగులు చేస్తే మ్యాచ్ కంప్లీట్ అవుతుంది అనగా ఆ టైంలో అంపైర్స్ లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ “భారతదేశంలో బ్యాంకులు ఉద్యోగులు లంచ్ బ్రేక్ లో కస్టమర్లను పట్టించుకోకుండా వెళ్లిపోతారు వాళ్ల కోసం కామన్ మ్యాన్ గంటలకొద్దీ నిరీక్షించాలి” అంటూ మ్యాచ్ తో పోలిక పెట్టి ట్విట్ చేశాడు. అయితే దీనిపై జోకులు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కస్టమర్లతో బ్యాంకు ఉద్యోగులు ఎలా వ్యవహరిస్తారో, భారత ఆటగాళ్లను కూడా అంపైర్లూ అలాగే చూశారని లంచ్ కే బాద్ ఆనా అంటూ పంపించేశారని తనదైన స్టయిల్ లో ట్వీట్ చేశాడు. ఒక బాధ్యతాయుతమైన క్రికెటర్ అయి వుండి మరొక బాథ్యతాయుత హోదాలో వున్న ఉద్యోగులను ముడిపెట్టి ఈ విధమైన కామెంట్లు చేయడం సరికాదని బ్యాంకు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments