హిట్టా లేక ఫట్టా : నీవెవరో – అంత థ్రిల్లింగ్ గా లేదు

Saturday, August 25th, 2018, 09:10:25 AM IST

ఆది పినిశెట్టి హీరోగా, తాప్సి పన్ను, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా ఎంవివి సినిమా బ్యానర్ పై హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా నీవెవరో. రచయిత కోన వెంకట్ కథ, కథనాలను అందించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులనుండి ఎటువంటి స్పందనని పొందనుందో పూర్తి విశ్లేషణలో చూద్దాం. కథాపరంగా చూస్తే చిన్నప్పటినుండి అంధుడైన కళ్యాణ్ (ఆది పినిశెట్టి) తన కష్టంతో ఒక రెస్టారెంట్ ని నడుపుతుంటాడు. అయితే తనను చిన్నప్పటినుండి ఎంతో జెన్యూన్ గా ప్రేమించే అను (రితిక సింగ్) కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ అనుకోకొని పరిస్థితుల్లో కళ్యాణ్ కు వెన్నెల(తాప్సి)తో పరిచయం ఏర్పడడం, అది మెల్లగా ప్రేమగా మారడం జరుగుతుంది. ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకుని పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల కళ్యాణ్ కు అనూహ్యంగా చూపు తిరిగి వస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో వెన్నెల మాయమవుతుంది. చూపొచ్చిన కళ్యాణ్, వెన్నెల కోసం వెతకాని ప్రదేశం ఉండదు. అసలు వున్నట్లుండి వెన్నెల ఎందుకు మాయమయింది, ఆమె అసలు ఎవరు, ఆమె జాడ అసలు తెలుస్తుందా, ఆమె ఏమైంది,

వెతుకులాటలో కళ్యాణ్ వెన్నెలని కనుగొన్నాడా, చివరికి వారిద్దరికీ పెళ్లి అయిందా లేదా అనేది మిగతా కథ. ఇక కథలో అంధుడి పాత్రలో నటించిన ఆది పినిశెట్టి తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడనే చెప్పాలి. ఇక ప్రేమ సన్నివేశాలు మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాల్లో కూడా అతడు ఒదిగిపోయి యాక్ట్ చేసాడు. ఇక అను పాత్ర కాస్త చిన్నదే అయినప్పటికీ నటి రితిక సింగ్ తన పాత్ర పరిధి మేరకు బాగా ఆకట్టుకుంది. తన ప్రియుడిని కోల్పోవలసివచ్చినందుకు ఆమె చెప్పే డైలాగులు హృదయానికి హత్తుకుంటాయి. ఇక చివరిగా సినిమాలో ప్రధాన ఆకర్షణ వెన్నెల పాత్ర. నిజానికి సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వెన్నెల పాత్రలో తాప్సి తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. తాప్సి మంచి పరిణితి గల నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. ఇక సినిమా చివరిలో ఆమె చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో అచ్చు, మరియు ప్రసన్నల సంగీతంపర్వాలేదనిపిస్తుంది.

ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలా అలా సాగిపోయే సినిమా, ఒక్కసారిగా వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుడికి మరింత ఇంటరెస్ట్ ని పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో ఎక్కువగా కామెడీని చొప్పించే ప్రయత్నం చేయడం వల్ల సినిమా యొక్క స్లాట్ ని కొంత దెబ్బతీస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ ఆకట్టుకున్నా, క్లైమాక్స్ కు వచ్చేసరికి సినిమా రొటీన్ గా మారడంతో ప్రేక్షకుడికి ఊహించిన థ్రిల్ అయితే కలుగదు అని చెప్పుకోవాలి. ఇకపోతే సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సన్నివేశాల్లో అలరించేలా వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమాని బాగా ఖర్చు పెట్టి తీశారు నిర్మాతలు. ఇక మొత్తంగా చెప్పుకుంటే ఈ నీవెవరో చిత్రం మంచి థ్రిల్లర్ జానర్ లో సాగే సినిమా అయినప్పటికీ, సెకండ్ హాఫ్ లో అవసరం లేని కామెడీ మరియు అక్కడక్కడా నెమ్మదించే కొన్ని సన్నివేశాలు, మాములుగా సాగె క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకి కొంత ఇబ్బందిని చేకూర్చేవే. అయితే కొత్తదనాన్ని కోరుకుని థియేటర్ కి వెళ్లే ప్రేక్షకుడికి ఈ నీవెవరో చిత్రం కొంతవరకు కాస్త థ్రిల్ ని కాస్త ఎంటర్టైన్మెంట్ ని మరికాస్త విసుగుని ఇస్తుందని చెప్పవచ్చు….

నీవెవరో – సస్పెన్స్‌ గా సాగని థ్రిల్లర్‌

Reviewed By 123telugu.com |Rating :2.75/5

నీవెవరో – అంచనాలు అందుకోలేదు

Reviewed By Chitramala.com |Rating :2.5/5

నీవెవరో – వీక్ థ్రిల్లర్

Reviewed By cinejosh.com |Rating : 2.25/5

నీవెవరో – బీలో యావరేజ్ సినిమా

Reviewed By andhraheadlines.com |Rating : 2/5