అమెరికా తో ఇప్పటికీ చర్చలకు సిద్ధమే : ఉత్తర కొరియా

Friday, May 25th, 2018, 04:09:25 PM IST

గత కొద్దిరోజులుగా అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే చందాన ఒకరిపై మరొకరు విద్వేషంతో మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ వున్ ల మధ్య అభిప్రాయబేధాలు తార స్థాయికి చేరడంతో త్వరలో వీటికి ముగింపు పలికి రెండు దేశాలు ఒక ఏకాభిప్రాయానికి వస్తాయని భావించారు. ఈ సందర్భంగా రెండుదేశాల అధినేతల మధ్య సమన్వయ చర్చల కోసం వచ్చే జూన్ 12న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాగా అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సమావేశానికి తాను హాజరవడం లేదని, కావున సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ఒక లేఖ ద్వారా ప్రకటించారు.

అయితే దీనిపై ఉత్తర కొరియా నేతలు మాత్రం ఇంత జరిగినా కూడా మేము ఇప్పటికీ కూడా అమెరికా తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, తమ అధినేత కూడా చర్చలు సాగించేందుకు సుముఖంగా ఉన్నట్లు చెపుతున్నారు. ట్రంప్ ఈ సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేస్తారని ఊహించలేదని, దీనిపై విచారం చేస్తున్నట్లు ఉత్తర కొరియా మంత్రి కిమ్ కై గ్వాన్ అన్నట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అసలు ట్రంప్ ఈ భేటీని రద్దు చేయడానికి అసలు కారణం ఇటీవల కిమ్ చేసిన ప్రకటనల్లో అమెరికా పై తీవ్ర ద్వేషం, శత్రుత్వ వైఖరిని పెంచేవిగా ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో మన భేటీ అనవసరం అనిపించిందని ట్రంప్ తాను రాసిన లేఖలో తెలిపినట్లు సమాచారం అందుతోంది……

  •  
  •  
  •  
  •  

Comments