ఇక బాబు లక్ష్యం మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్

Monday, September 29th, 2014, 03:40:51 PM IST

babu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో ఐటి కంపెనీల సిఈఓల సదస్సులో పాల్గొన్నారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని ఆయన అన్నారు. విశాఖ ఐటి కంపెనీలు పెట్టేందుకు అనుకూలమైన ప్రాంతమని చంద్రబాబు నాయుడు తెలిపారు.

పలు ఐటి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఈస్ట్ కోస్ట్ ప్రాంతలో విశాఖ బెస్ట్ సిటీ అని ఆయన అన్నారు. ఐటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉన్నదని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని బాబు తెలిపారు. విశాఖను సిలికాన్ కారిడార్ గా మారుస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ప్రతి ఇంటికి ఒక ఐటి, వృత్తి నిపుణులను తయారుచేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఐటి రంగాన్ని డ్వాక్రాకూడా అనుసందానిస్తామన్నారు. విశాఖలోని మడురవాడను హైటెక్ సిటి కన్నా గొప్పగా అభివృద్ది చేస్తామన్నారు. విశాఖ ఆర్ధిక రాజధానిగా, విజయవాడ రాజకీయ రాజధానిగా ఇక తిరుపతి ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మరియు నాలుగు వందల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.