పేటియం ఉద్యోగులు ఇప్పుడు మిలియనీర్లు !

Monday, January 29th, 2018, 10:05:24 AM IST

మన దేశంలో ప్రధాని మోడీ పెద్ద నోట్లు రద్దు తర్వాత నల్లధనం బయటకి ఎంతవరకు తీసుకొచ్చారనే విషయాన్నీ పక్కన పెడితే, దానివల్ల ప్రజలు డిజిటల్ లావాదేవీల పై దృష్టి పెట్టారనేది ఒప్పుకోవాల్సిన విషయం. గ్రామీణ ప్రాంతాల్లో కొంత వరకు ఈ రకమైన లావాదేవీల పై దృష్టిపెట్టకపోయిన నగర జనాభా ఈ వైపుగా అడుగులువేస్తోదని తెలుస్తోంది. అదే సమయంలో పేటియం వంటి డిజిటల్ చెల్లింపుల సంస్థలు బాగానే వృద్ధిచెందాయి. అయితే ప్రస్తుతం ఈ సంస్థలో వ్యవస్థాపకులు పెద్ద బిలియనీర్లుగా ఎదిగితే ఆ సంస్థలోని ఉద్యోగులు మిలియనీర్లుగా మారారు .బిజినెస్, టెక్నాలజీ, ప్రోడక్ట్, అడ్మినిస్ట్రేటివ్, హ్యూమన్ రిసోర్సెస్, సేల్స్, ఫైనాన్స్ లలో పనిచేసే అందులోని 200 మంది ఉద్యోగులు ఐదు బిలియన్లకు ధనవంతులయినట్లు పేటియం సంస్థ అంటోంది. అయితే ఇందులో చాలా మంది ఉద్యోగులు కంపెనీ ప్రారంభం నుండి వున్నవారే అని తెలియవస్తోంది. ఇటీవల ప్రకటించిన రెండవ షేర్ విక్రయంతో కంపెనీ విలువ 635.8 బిలియన్లకు చేరింది, తద్వారా ఉద్యోగులు తమ ఎంప్లాయ్ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ ను నగదుగా మార్చుకునేందుకు అవకాశం లభించింది. ఈ క్రమంలో వారి ఆదాయం ఐదు బిలియన్లకు చేరింది. నిజానికి కంపనీలోని షేర్ లను కొనుగోలు చేసేందుకు ఈ ఎంప్లాయ్ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ (ఈఎస్ఓపి) ఒక ప్రయోజన కారిగా చెప్పవచ్చు. ఈ రెండవ సారి విక్రయించిన షేర్లలో 2017 మే నాటికి 445.09 బిలియన్ లు గా ఉన్న కంపెనీ విలువ ఇప్పుడు 635.8 బిలియన్లకు పెరిగింది. మొబైల్ ఫస్ట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ అయినా పేటియం ను వన్ 97 కమ్యూనికిషన్ లిమిటెడ్ నడిపిస్తున్న విషయం తెలిసిందే..