సీఎం అభ్యర్థిగా ఎన్టీఆర్..టీడీపీ బాగుపడాలంటే అదొక్కటే మార్గం..!

Sunday, February 4th, 2018, 03:22:58 PM IST


ఎపి మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. అట్లాంటాలో ఓ సమావేవంలో పాల్గొన్న లోకేష్ కు ఎన్నారై అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరాడు. అలా చేస్తే టీడీపీకి కనీసం 30 సీట్లు అయినా దక్కుతాయనేది ఎన్నారై అభిమాని అభిప్రాయం.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ లతో టీడీపీ పొత్తు పెట్టుకుని వెళితే ప్రయోజనం ఉంటుందని సూచించారు. మరి కొందరు అభిమానులు బలయ్య గురించి స్పందించవలసిందిగా లోకేష్ ని కోరారు. సింహం గురించి ఏం చెప్పాలి అంటూ లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. ఒక సమరసింహారెడ్డి, సింహ, లెజెండ్ ఇలా మీకు బాలయ్య అయితే నాకు ముద్దుల మామ అని లోకేష్ వ్యాఖ్యానించాడు.