ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ రిలీజ్ డౌటే ?

Thursday, August 9th, 2018, 11:22:18 PM IST


జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాపై ప్రస్తుతం ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో త్రివిక్రమ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగలడని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ బ్రేకులు లేకుండా చకచకా ముందుకు సాగుతోంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకర్షించే విధంగా ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయట. ఇక త్రివిక్రమ్ మార్క్ కామెడీ కూడా సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అసలు విషయంలోకి వస్తే.. ఈ సినిమా మొదట దసరాకి వస్తుందని చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా పాటలకు సంబందించిన పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే అక్టోబర్ 11వ తేదీన సినిమా విడుదల ఉంటుందని షెడ్యూల్ సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ లో తేడా వచ్చే సరికి సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం. ఇక సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ అయితే అనుకున్న సమయానికి స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 15వ తేదీన ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చెయ్యాలని ముందే ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం అందుకు సంబందించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments