తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తారక్?

Monday, September 10th, 2018, 05:33:41 PM IST

మొన్నటి వరకు అందరి ద్రుష్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఉంటే ఇప్పుడు సడన్ గా తెలంగాణ ఎన్నికల వైపు మళ్లింది. ముందస్తు ఎన్నికలు అంటూ కేసీఆర్ ప్రకటించిన విధానం ప్రజల్లో ఎంతవరకు పాజిటివ్ అంశంగా మారుతుంది అనేది ఎన్నికల ముగిసే వరకు చెప్పడం కష్టమే. ప్రస్తుతం కాంగ్రెస్ పొత్తుల వ్యూహం రచిస్తోంది. మెయిన్ గా అందరికంటే కొంత ఎక్కువగా ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీతో కలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టికెట్ల విషయంలో ఒక క్లారిటీకి వచ్చిన టీడీపీలో మరో కీలక అంశం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణాలో పార్టీ తరపున ప్రచారాలను ఎవరు నిర్వహిస్తారు అనేది అందరిలోనూ నెలకొన్న ఆసక్తి. చంద్రబాబు అయితే ఒకటి రెండు బహిరంగ సభలకు వచ్చినప్పటికీ ఏపి రాజకీయాల దృష్ట్యా పూర్తిగా ప్రచార బాధ్యతలను అయితే తీసుకోలేరు. దీంతో లోకేష్ నాయకత్వంలో ఎన్నికల ప్రచారం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ కంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో నిలబడితే తప్పకుండా ప్రజలను ఆకర్షించవచ్చని పలువురు సీనియర్ నాయకులు చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారట. 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి తెలంగాణలో కొన్ని స్థానాల్లో తారక్ తో ప్రచారాలని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నట్లు సమాచారం. మరి తారక్ దానికి ఒప్పుకుంటారా? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

  •  
  •  
  •  
  •  

Comments