కెరీర్ ని రిపేర్ చేసిన దర్శకుడికి ఎన్టీఆర్ భారీ బహుమానం !

Thursday, September 29th, 2016, 12:10:10 PM IST

ntr-koratala-siva
ఎన్టీఆర్ ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నా కూడా కేవలం 40 కోట్ల హీరోగానే ఉన్నాడు. అయన ఎన్ని సినిమాలు చేసిన ఈ మార్క్ దాటలేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన ”జనతా గ్యారేజ్” సినిమాతో ఎన్టీఆర్ మార్కెట్ ఏకంగా వందకోట్లకు చేరుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో పవన్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ లతో పాటు 70- 100 కోట్ల మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. మొత్తానికి తన సినీ కెరీర్ ని రిపేర్ చేసిన దర్శకుడు కొరటాల శివ కు ఇప్పుడు భారీ బహుమతి ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్ ? ఇప్పటికే ”శ్రీమంతుడు” సినిమాతో తన కు భారీ బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందించిన ఈయనకు మహేష్ కూడా కార్ బహుమతి గా ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే తమ బ్యానర్ లో రెండు బాక్స్ ఆఫీస్ హిట్స్ ని అందించిన కొరటాల కు మైత్రి బ్యానర్ వాళ్లు కూడా బహుమతి ఇవ్వాలని అనుకున్నారట, దాంతో మైత్రి బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఓ విల్లా ను గిఫ్ట్ గా ఇవ్వనున్నారని సమాచారం !! ఇప్పటికే హైద్రాబాద్ లో ఓ మంచి విల్లా కోసం సెర్చ్ జరుగుతున్నట్టు తెలిసింది.

  •  
  •  
  •  
  •  

Comments