“ఎన్టీఆర్ కధానాయకుడు”: టాక్ ఏమో అలా – కలెక్షన్స్ ఏమో ఇలా..!

Thursday, January 10th, 2019, 03:51:25 PM IST

బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. మహానటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు బాగాలుగా విడుదల చేస్తున్నారు. కాగా మొదటి కథానాయకుడు జనవరి 9న విడుదలైంది, రెండవ భాగం మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన కథానాయకుడు సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. బాలకృష్ణను ఎన్టీఆర్ గెటప్పుల్లో చుసిన అభిమానులు అన్న గారిని మళ్లీ తెరపై చూసినట్లుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణుడి గెటప్ లో, వయసైన ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అచ్చు ఎన్టీఆర్ ను దించేసాడని అంటున్నారు.

అభిమానుల మాట అలా ఉంచితే, నార్మల్ ఆడియెన్స్ స్పందన ఇంకోలా ఉంది , సినిమాలో యంగ్ ఎన్టీఆర్ రోల్ లో బాలకృష్ణ అక్కడక్కడా ఇబ్బందికరంగా ఉన్నారని, ఏజ్ కనపడుతోందని అంటున్నారు. యంగ్ ఎన్టీఆర్ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ అయ్యుండుంటే సినిమా ఇంకోలా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యం మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ బాలకృష్ణ గత చిత్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి తోలిరోజు కలెక్షన్లు 9.70 కోట్లు కాగా, బాలకృష్ణ కెరీర్లోనే ఇది హైయెస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ పైసా వసూల్ 7.80 కోట్ల వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఇక కథానాయకుడు 7.60కోట్లు వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. టాలీవుడ్ వర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన కథానాయకుడు తోలి రోజు కలెక్షన్లు ఆశించినంత లేకపోవటం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లను టెన్షన్ కు గురి చేస్తోంది. అయితే సినిమా విడుదలైన రోజు వీకెండ్ కాకపోవటం, చాలా మంది జనాలు సిటీ నుండి సొంత ఊళ్లకు వెళ్లే హడావిడిలో ఉండటం వల్ల సినిమా పెద్దగా పట్టించుకొని ఉండరని, ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికీ వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.