ఎన్టీఆర్ – కథానాయకుడు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఏమైంది..?

Thursday, January 10th, 2019, 04:25:52 PM IST

విశ్వ‌న‌టుడు, న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ క‌థానాయ‌కు విడుదలైన తొలిరోజు నుండే మిశ్ర‌మ స్పంద‌న సొంతం చేసుకుంది. ఇక నందమూరి అభిమానుల‌కు అయితే అన్ని విధాలా సంతృప్తి ప‌ర్చినా.. కామ‌న్ ఆడియ‌న్స్‌కు మాత్రం అసంతృప్తిని మిగిల్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే సినీ ప్ర‌ముఖులు మాత్రం ఈ సినిమాని ఆకాశాని ఎత్తేస్తున్నారు. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంద‌ని, క్రిష్ టేకింగ్, బాల‌య్య న‌ట‌న‌, అత‌ని గెట‌ప్స్ అన్నీ చాలా బాగున్నాయ‌ని, స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌కు ఈ చిత్రం స‌రైన ఘ‌న నివాళి అంటూ స్పందిస్తున్నారు.

అయితే ఇప్పుడు అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం పై జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా తొలి షోకి నంద‌మూరి, నారా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా క‌లిసి వ‌చ్చినా తార‌క్ మాత్రం రాలేదు. ఏదో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి తార‌క్ వెళ్ల‌డం.. ఆ త‌ర్వాత నంద‌మూరి కుటుంబ స‌భ్య‌లు తామంతా ఒక‌టే అని చెబుతున్నా, బాల‌య్య‌- తార‌క్‌ల మ‌ధ్య గ్యాప్ మాత్రం అలానే ఉంద‌ని కొంద‌రు చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్, బాల‌య్య‌ల విష‌యం ప‌క్క‌న పెడితే, త‌న తండ్రి పాత్ర పోషించిన, అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ కోస‌మైనా తారక్ స్పందిస్తే బాగుండేద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బిజీగా ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ అస‌లు సినిమా చూశాడో లేదో అని మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా బాల‌య్య – తార‌క్‌ల మ్యాట‌ర్ మ‌రోసారి సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.