ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు : ఫ‌స్ట్‌హాఫ్ రిపోర్ట్.. తెర‌మీద సిస‌లైన ఎన్టీవోడు..!

Thursday, February 21st, 2019, 03:00:46 PM IST

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్రేక్ష‌కుల‌ను నిరుత్సాహ‌ప‌ర్చింది. దీంతో రెండ‌వ భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుతో అయినా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోవాల‌ని భావిస్తున్నారు బాల‌కృష్ణ‌, క్రిష్‌లు. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు ప్రీమియ‌ర్స్ స్టార్ట్ అయ్యి ఫస్ట్‌హాఫ్ కంప్లీట్ అయ్యింది. మ‌రి ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు ఫ‌స్ట్‌హాఫ్ ఎలా ఉందో తెలుసుకుందాం.

మ‌హానాయ‌కుడు ఫ‌స్ట్‌హాఫ్‌లో ఎన్టీఆర్ రాజ‌కీయ జ‌ర్నీని ద‌ర్శ‌కుడు క్రిష్ అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ చిన్న‌నాటి స‌న్నివేశాలు, నారా దేవాన్ష్ చిన్న‌ప్ప‌టి ఎన్టీఆర్‌గా ఎంట్రీ స‌ర‌ప్రైజింగా ఉంది. ఇక పార్టీ స్థాపించిన త‌ర్వాత, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల నేప‌ధ్యంలో రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించిన సీన్ బాగున్నాయి. అలాగే రికార్డు స్థాయిలో పార్టీ గెలిచినప్ప‌టి సీన్లు నంద‌మూరి అభిమానులు థియేట‌ర్‌లో విజిల్స్ వేసేలా ఉన్నాయి.

ఇక ముఖ్య‌మంత్రిగా జ‌ర్నీ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ పార్టీలోనూ, కుటుంబంలోనూ ఎద‌రైన స‌వాళ్ళుకు సంబంధించి సీన్లు బాగున్నాయి. టోట‌ల్‌గా చెప్పాలంటే.. ఫ‌స్ట్‌హాఫ్‌లో పొలిటిక‌ల్ జ‌ర్నీని బాగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు క్రిష్. అలాగే మంచి ఎమోష‌న్ సీన్స్ డిజైన్ చేయ‌డం, బాల‌య్య ఆ పాత్ర‌లో ఒదిగి పోవ‌డంతో చిన్న ట్విస్ట్‌తో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ వేశారు. ఇక ఫ‌స్ట్‌హాఫ్ ఎలాంటి బ్రేకులు లేకుండా సాగిన మ‌హానాయ‌కుడు సెకండ్‌హాఫ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.