మూవీ రివ్యూ : ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు

Friday, February 22nd, 2019, 03:03:43 PM IST

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేంది. తొలిభాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కు ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టింది. ఎన్టీఆర్ సినిమా జ‌ర్నీ నేప‌ధ్యంలో ఫ‌స్ట్ పార్ట్ తెర‌కెక్క‌డం.. అందులో పెద్ద‌గా ఎమోష‌న్స్ లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదు. అయితే ఎన్టీఆర్ పొలిటిక‌ల్ జ‌ర్నీ నేప‌ధ్యంలో మ‌హానాయ‌కుడు తెర‌కెక్క‌డంతో, ప్రేక్ష‌కుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మ‌రి మ‌హానాయ‌కుడు ప్రేక్ష‌కుల‌ను ఏమేకు ఆకట్టుకుందో తెలియాలంటే ఈ రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.

క‌థ :

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలో ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో ప్రవేశించడం, హీరోగా ఎదగడం, అభిమానుల్లో క్రేజ్ సంపాదించడం.. తెలుగు సినిమా తొలి సూప‌ర్ స్టార్‌గా దూసుకుపోతున్న‌ ఎన్టీఆర్ .. రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ప్రేరేపించిన ప‌రిస్థితులను క‌వర్ చేస్తూ రూపొందిన కథానాయకుడు చివ‌రికి పార్టీ పేరు ప్ర‌కటించ‌డంతో ఎండ్ కార్డ్ వేశారు. ఇక మ‌హానాయ‌కుడు క‌థ విష‌యానికి వ‌స్తే.. పార్టీ స్థాపించిన త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌జ‌ల్లోకి ఏ విధంగా వెళ్ళారు.. ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప్ర‌భంజ‌నంతో రికార్డు విజ‌యం ఎలా సొంత చేసుకున్నారు.. ప్ర‌జ‌ల‌కోసం ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు.. ఆ త‌ర్వాత పార్టీలోనూ, ప‌ర్ష‌న‌ల్ లైఫ్‌లోనూ ఎలాంటి స్ట్ర‌గుల్స్ ఫేస్ చేశారు అనేది తెలియాలంటే ఈ సినిమాని వెండితెర పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ :

క‌థానాయ‌కుడు ఫ్లాప్ త‌ర్వాత మ‌హానాయ‌కుడు సినిమాపై నిజంగానే అంచ‌నాలు త‌గ్గిపోయాయి. అయితే ఎన్టీఆర్ పొలిక‌ల్ జ‌ర్నీ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఆశ‌క్తి, అంచ‌నాలు మాత్రం ఉన్నాయ‌నే చెప్పాలి. ఎలాంటి టైమ్ వేస్ట్ చేయ‌కుండా అస‌లు క‌థ‌లోకి వెళిపోయిన మ‌హానాయ‌కుడు ఎవ్వ‌రినీ నిరాశ‌ప‌ర్చ‌డ‌ని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ప్లానింగ్‌తో పార్టీ స్థాపించ‌డం భారీ మెజారిటీతో జ‌య‌భేరి మోగించ‌డం రియ‌లిస్టిక్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజ‌కీయాల‌కు సంబంధించిన సీన్స్ ఎక్స్‌లెంట్‌గా ప్రెజెంట్ చేశారు క్రిష్‌. అలాగే ముఖ్య‌మంత్రి అయ్యాక ఒక‌వైపు పార్టీలో త‌న‌కు ఎదురైన మేజ‌ర్ ప్లాబ్ల‌మ్స్, మ‌రోవైపు ప‌ర్స‌న‌ల్ ప్లాబ్ల‌మ్స్‌కు సంబంధించి ఎమోష‌న్స్‌ను సంబంధించి సీన్స్ హైలెట్‌గా నిలిచాయి.

ఇక ఇంట్ర‌ర్వెల్‌లో ఊహించ‌ని ట్విస్ట్.. ఎన్టీఆర్ పొలిటిక‌ల్ కెరీర్ ఊహించ‌ని మ‌లుపు తిరుగుతుంది. ఒక‌వైపు ఎన్టీఆర్ లండ‌న్ టూర్ వెళ్ళ‌డం.. మ‌రోవైపు ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించ‌డానికి కుట్ర జ‌ర‌గం చ‌క‌చ‌కా జ‌రిగిపోతుంటాయి. ఆ త‌ర్వాత ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌డానికి ఎన్టీఆర్ చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వ‌డం విజువ‌ల్‌గా వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇక ఆ త‌ర్వాత ఎన్టీఆర్ చైత‌న్య ర‌థ‌యాత్రం స్టార్ట్ చేయ‌డం.. మళ్ళీ ప‌వ‌ర్‌లోకి రావ‌డానికి పోరాటం చేయ‌డం.. ఫైన‌ల్‌గా మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవ‌డం, ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం, బ‌స‌వ‌తార‌క‌మ్మ ఎపిసోడ్‌కు సంబంధించి సెంటిమెంట్ సీన్స్ ఇలా చాలా వ‌ర‌కు ఆశ‌క్తిగానే తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు.

ఇక యంగ్ ఎన్టీఆర్‌గా కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న బాల‌కృష్ణ‌, పెద్ద ఎన్టీఆర్‌గా ఒదిగిపోయాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో అయితే ఎన్టీఆర్‌నే చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. బ‌స‌వ‌తార‌కంగా క‌థానాయ‌కుడులోనే మంచి మార్కులు కొట్టేసిన విద్యాబాల‌న్ మ‌హానాయ‌కుడులో మ‌రోసారి సెటిల్డ్ న‌ట‌నతో ఆక‌ట్టుకుంది. చంద్ర‌బాబుగా రానా ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవ్వ‌డ‌మే కాకుండా, కొన్ని సీన్ల‌లో హైలెట్ అయ్య‌డు. నాదెండ్ల బాస్క‌ర్ రావు క్యారెక్ట‌ర్‌ను మాత్రం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే చూపించారు. ఇక మిగ‌తా పాత్ర‌లు వారి పరిదిమేర‌కు బాగానే చేశారు. ఫొటోగ్ర‌ఫీ, ఆర్ట్ వ‌ర్క‌, సంగీతం అన్నీ ఫ‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఇక అక్క‌డ‌క్క‌డా సీన్లు లాగ్ అయిన‌ట్టు అనిపించినా ఈ చిత్రం క‌థానాయ‌కుడు కంటే బాగానే ఉంద‌ని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

ఎన్టీఆర్‌గా బాల‌య్య న‌ట‌న‌

మిగ‌తా స్టార్ కాస్ట్ పెర్ఫామెన్స్

కీర‌వాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్

ఎమోష‌న‌ల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

ఆక‌ట్టుకోని స్క్రీన్‌ప్లే

రియాలిటీకి దూరంగా కొన్ని సీన్స్

క్లైమాక్స్

తీర్పు :

ఫైన‌ల్‌గా చెప్పాలంటే ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రం కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన మొద‌టి భాగం క‌థానాయ‌కుడు నిరాశప‌ర్చినా, మ‌హానాయ‌కుడు మాత్రం ప్రేక్ష‌కులను ఏమాత్రం నిరాశ‌ప‌ర్చ‌ద‌ని చెప్పొచ్చు. ఎన్టీఆర్ సినిమా జ‌ర్నీకంటే పొలిక‌ల్ జ‌ర్నీని బాగానే తెర‌కెక్కించారు. మ‌రీ ఏమంత గొప్ప‌గా లేకున్నా డీసెంట్‌గా ఉంది.. అందురూ త‌ప్ప‌కుండా ఒక‌సారైనా చూడాల్సిన చిత్రం మ‌హానాయ‌కుడు.

రేటింగ్ : 3/5

4 & Above – Must Watch
3.5 – Hit
3 – Average
2.5 – Below Average
2 & Below – Stay Away

REVIEW OVERVIEW
NTR Mahanayakudu Movie Review in Telugu