‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ అమలుకు ఏర్పాట్లు

Tuesday, September 16th, 2014, 08:40:45 AM IST


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ సురక్షిత తాగునీటిపధకం అమలు చేయడానికి విశాఖపట్నంలోని 22 ప్రాంతాలను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంతాలలో నీటిని శుద్ధపరిచే రివర్స్ ఆస్మాసిస్ నీటి శుద్దీకరణ వ్యవస్థ ఏర్పాటుకు విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ప్రణాలికలను రచిస్తోంది.

కాగా ప్రస్తుతం విశాఖలోని తొమ్మిది మురికి వాడల్లో ఎటువంటి నీటి సౌకర్యం లేనట్లుగా తెలుస్తోంది. అలాగే మరో ఏడు మురికివాడల్లో నీటి సరఫరా ఉన్నప్పటికీ అధికారుల విశ్లేషణ ప్రకారం అది వినియోగానికి పనికి రాదని తెలుస్తోంది. ఇక మిగిన ఆరు మురికివాడ ప్రాంతాలలో పైప్ లైన్లు ఉన్నప్పటికీ నీటి సరఫరా మాత్రం జరగడం లేదు. అయితే వీటిని అన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని గ్రేటర్ విశాఖ అధికారులు ఈ 22 ప్రాంతాలలో సురక్షిత తాగునీటి పధకం అమలు చెయ్యాడానికి సంకల్పించారు. దీనిపై కమీషనర్ ఎంవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పధకం ద్వారా 20లీటర్ల సురక్షిత నీటిని కేవలం 2రూపాయలకే అందించనున్నట్లు తెలిపారు. ఇక ఈ యూనిట్ ల ఏర్పాటుకు ఒక్కోదానికి 5నుండి 6లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, అలాగే ప్రజల సౌలభ్యం కొరకు ఏర్పాటు చెయ్యడానికి కోటి రూపాయల కన్నా అధిక వ్యయం అవుతుందని వివరించారు.