ఫస్ట్ లుక్ : ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ అదిరింది!

Saturday, May 19th, 2018, 05:18:39 PM IST

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఎవరు ఊహించని విధంగా సరికొత్త టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశారు. ముందుగా అసామాన్యుడు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పలురకాల వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ వట్టి రూమర్స్ అని తేలిపోయాయి. ఫైనల్ గా త్రివిక్రమ్ తన మార్క్ కి తగ్గటుగా ” అరవింద సమేత వీర రాఘవ” అనే టైటిల్ ను సెట్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదిరిందనే చెప్పాలి. సరికొత్త ఫిట్ నేస్ తో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో తారక్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments