అక్క గెలవాలని కోరుకుంటున్నా – ఎన్టీఆర్ ..!

Friday, December 7th, 2018, 10:50:52 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది, ఆయా కేంద్రాలకు అదనపు సమయం కేటాయిస్తాం అని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్, సుహాసిని గెలవాలని ఆకాంక్షిస్తున్న అంటూ ట్వీట్ చేసాడు.

నందమూరి సుహాసిని కూకట్ పల్లి స్తానం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే, మొదట్లో అక్కకు మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడని భావించారు కానీ, ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు. సుహాసిని కి మద్దతుగా పార్టీ తరఫున చంద్రబాబు, బాలయ్య, లతో పటు తారకరత్న కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. వినియోగించుకున్న ఎన్టీఆర్ అక్కకు మద్దతుగా ట్వీట్ చేస్తూ, స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబమే తమదని, ఇదే స్ఫూర్తితో ప్రజాసేవ చేయడానికి సిద్దమైన సుహాసిని గారికి విజయం వారించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ ట్వీట్ చేసాడు.