వీడియో: జూ. ఎన్టీఆర్ ఐపీఎల్ యాడ్ చూసారా..ఇరగదీసాడుగా…

Tuesday, April 3rd, 2018, 08:50:38 PM IST

గత కొద్దికాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఐపీఎల్ లీగ్ యాడ్ కోసం కష్టపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేయాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ నెట్‌వర్క్ తెలుగులో ఈ ఓ యాడ్‌ను విడుదల చేసింది. స్టార్ మా ఆధ్వర్యంలో తెలుగులో వచ్చిన బిగ్‌బాస్ తొలి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో విశేషాదరణ కలిగిన ఎన్టీఆర్‌తో తెలుగులో ఐపీఎల్‌ను ప్రమోట్ చేయడానికి ప్రోమోలు కూడా షూట్ చేసింది. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ ఖాతా ద్వారా ఎన్టీఆర్ నటించిన ప్రోమోను విడుదల చేసింది. ఎన్టీఆర్ కొత్త లుక్‌లో సింపుల్‌గా డైలాగ్స్ చెప్పారు. ఇందులో టాలీవుడ్‌కు చెందిన సహాయ నటులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఐపీఎల్ జనాలను ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుందో ఆట మొదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.