అమెరికాకు ఒక హిందువు కూడా అధ్యక్షుడు అవుతాడంటున్న ఒబామా….!

Friday, January 20th, 2017, 08:29:04 AM IST

obama
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన చివరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఒక విలేకరి ‘మరొక నల్లజాతి అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందా…?’ అని ఒబామాను ప్రశ్నించాడు. దానికి ఆయన అందరికీ అవకాశాల విధానాన్ని కొనసాగిస్తే ఒక హిందువు కూడా అమెరికా అధ్యక్షుడు అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలోని జాతి వైవిధ్యాన్ని కాపాడితే ఒక మహిళ, ఒక హిందువు, ఒక యూదు, ఒక లాటినో అధ్యక్షులు తప్పకుండ వస్తారని ఆయన అన్నారు. భవిష్యత్తులో జాతులతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే ఉన్నత స్థానాల్లోకి వస్తారని ఒబామా విశ్వాసం వ్యక్తం చేశారు.

అధ్యక్షుడిగా చివరిసారిగా ఒబామా భారత ప్రధాని నేరేడ్న్రా మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇన్నాళ్లు అమెరికా, భారత్ ల సంబంధానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ కూడా ఒబామా కు కృతజ్ఞతలు చెప్పారు. 2015లో ఢిల్లీలో గణతంత్ర వేడుకులకు వచ్చినపుడు జరిగిన సంగతులను ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. శుక్రవారం తో తన పదవీ భాద్యతలు ముగియడంతో తరువాత తన శేష జీవితాన్ని ఒక రచయితగా గడపాలని ఆయన భావిస్తున్నారు. ఇకనుండి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతానని, ఎక్కువ సమయం తన కూతుళ్లతో గడుపుతానని ఒబామా చెప్పారు.