నేను సీన్ లో ఉండి ఉంటే వార్ వన్ సైడ్ అంటున్న ఒబామా..

Tuesday, December 27th, 2016, 12:34:46 PM IST

obama
కొన్ని రోజుల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేకిత్తించాయి. అధ్యక్ష ఎన్నికలపై జరిగిన అన్ని సర్వేలు డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తాయని చెప్పాయి, కానీ ఎవరూ ఊహించని విధంగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సోమవారం తన చిరకాల మిత్రుడు, సీఎన్ఎన్ అనలిస్ట్ అయిన డేవిడ్ యాక్సలర్డో కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ… తాను ఎన్నికల బరిలో నిలుచుని ఉంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచి ఉండేవాడు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హిల్లరీ క్లింటన్ ప్రచారంలో ఎటువంటి లోపం లేదు అని ఆయన అన్నారు. జరిగిందేదో జరిగిందని, హిల్లరీ ఇప్పటి నుండి ట్రంప్ చేసిన వాగ్ధానాలపై ద్రుష్టి పెట్టాలని సూచించారు. ఒబామా చేసిన ఈ వ్యాఖ్యలపై కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ లో స్పందించారు. ఉద్యోగాల సంక్షోభం, ఐసిస్, ఒబామా కేర్ వంటి అంశాలను పెట్టుకుని ఆయన ఇంకా గెలుస్తాడని అనుకుంటున్నాడా..? నేనైతే ఆలా అనుకోవడం లేదని ఆయన అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments