పోలవరం పూర్తయితే మేము నష్టపోతాం.. ఆపెయ్యండి : ఒడిశా సీఎం

Saturday, June 2nd, 2018, 10:03:54 PM IST

గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఊరిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎంత మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా కూడా ఎక్కడి పని అక్కడే ఆగిపోయింది. ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా కేంద్రం కొన్ని రోజులు హడావుడి చేసి ఆ తరువాత పట్టించుకోవడం మానేసింది. 2019 ఎలక్షన్స్ దగ్గరపడుతుండడంతో మళ్లీ పోలవరం వివాదం తెరపైకి వస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి తక్షణమే ప్రాజెక్టు పనులు ఆపేయాలని ఆరోపణలు వస్తున్నాయి.

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కేంద్రాన్ని కోరడం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఒడిశా ఎదుర్కొంటున్న సమస్యలు ఓ కొలిక్కి వచ్చే వరకు పనులు ఆపివేస్తే అందరికి మంచిదని కేంద్ర పర్యావరణ శాఖమంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. సమస్యలు ఇంకా పూర్తవ్వలేదు. అప్పుడే పోలవరం ప్రాజెక్టు మొదలైతే ఒడిశా ప్రజలు చాలా వరకు నష్టపోవాల్సి ఉంటుంది. శబరి, సీలేరు నదీ జలాల విషయం కూడా ఇంకా తేలలేదు. ముంపు గ్రామాల పునరావాస అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణమే గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్‌ నిబంధనల్ని అతిక్రమించడమేనని పర్యావరణ శాఖకు నవీన్‌ పట్నాయక్‌ లేఖలో తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments