హిట్టా ఫట్టా : ఆఫీసర్..అదే వర్మ.. అదే సినిమా!

Friday, June 1st, 2018, 05:17:52 PM IST

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ఆఫీసర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తరువాత వర్మ ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తుండడం వల్ల అందరిలో ఆసక్తి నెలకొంది. పైగా ప్రమోషన్స్ తో కూడా క్రేజ్ బాగానే పెంచారు. అయితే ఈ సినిమా టాక్ మాత్రం విభిన్నంగా వస్తోంది. వర్మ అనుకున్నంతగా మెప్పించలేదు అని కథనాలు వెలువడుతున్నాయి. ఎంచుకున్న కథ బాగానే ఉన్నా తెరకెక్కించిన విధానం బాగాలేదని టాక్ వస్తోంది.

ఫస్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగి సెకండ్ హాఫ్ డల్ అయిపోవడం సినిమాలో పెద్ద మైనెస్ గా నిలిచింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాగార్జున ఈ సినిమాలో కాస్త కొత్తగా కనిపింఛాడనే చెప్పాలి. ఎక్కువగా నాగ్ నటన సినిమాలో హైలెట్ అని ప్రశంసలు అందుతున్నాయి. అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గా సినిమాలో నాగ్ అందరిని ఆకట్టుకుంటాడనే చెప్పాలి. అయితే వర్మ స్థాయిలో ఉండే క్రైమ్ డ్రామా ఈ సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకున్న లైన్ కొత్తగా ఉన్నప్పటికీ సినిమాను మెప్పించే విధంగా వర్మ తెరకెక్కించలేకపోయాడు. ఇక వివిధ వెబ్ సైట్లు ఇచ్చిన రివ్యూలు, సోషల్ మీడియాలో టాక్ ఈ విధంగా ఉన్నాయి.

ఆఫీసర్ – నాగార్జున తన డ్యూటీ చేశాడు కానీ

Reviewed By 123telugu.com |Rating :2.5/5

భరించలేని ఆఫీసర్

Reviewed By mirchi9.com |Rating :1.5/5

ఆర్జీవీ మార్క్ మిస్సయ్యింది

Reviewed By telugumirchi.com |Rating :2.5/5

కన్ఫ్యూజన్ సినిమా

Reviewed By indiatimes.com |Rating : 1.5/5

ఆఫీసర్.. అదే వర్మ.. అదే సినిమా

Reviewed By tupaki.com |Rating : 1.5/5


 


  •  
  •  
  •  
  •  

Comments