రివ్యూ రాజా తీన్‌మార్ : ఆఫీసర్ – అభిమానులు భయపడ్డట్టే జరిగింది

Friday, June 1st, 2018, 07:35:19 PM IST

తెరపై కనిపించిన వారు : నాగార్జున, మైరా సరీన్
కెప్టెన్ ఆఫ్ ‘ఆఫీసర్’ : రామ్ గోపాల్ వర్మ

మూల కథ :
వరుస ఎంకౌంటర్లు చేస్తున్న ముంబై పోలీసాఫీసర్ నారాయణ పసారిఫై విచారణ జరిపేందుకు కోర్టు సిట్ ను నియమిస్తుంది. ఈ సిట్ కు ప్రధాన అధికారిగా హైదరాబాద్ కు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ శివాజీరావు (నాగార్జున )ను నియమిస్తారు. పసారి ఒక చేత్తో మాఫియాను అంతమొందిస్తూనే మరో పక్క డబ్బుల కోసం కాంట్రాక్టు కిల్లింగ్ చేస్తుంటాడు.

శివాజీరావు విచారణ చేప్పట్టిన తరువాత పసారిని అరెస్ట్ చేసినా సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టివేయడం జరుగుతుంది. తన అరెస్ట్ తో కలత చెందిన పసారి కంపనీ అనే మాఫియాను తయారు చేస్తాడు. ఈ కంపెన ని, పసారిని శివాజీ రావు ఎలా పట్టుకుంటాడు అనేదే సినిమా.

విజిల్ పోడు :

→  మొదటి విజిల్ నాగార్జునకు వేయాలి. ఎందుకంటే తనకిచ్చిన శివాజీ పాత్రలో నాగ్ ప్రాణం పెట్టి నటించారు. చాలా రోజుల తర్వాత పోలీస్ పాత్రను ధరించినా అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ కనబర్చారు. సినిమా ఎంతో కొంత బాగుందంటే అది నాగ్ కారణంగానే అని చెప్పొచ్చు. కాబట్టి మొదటి విజిల్ ఆయనకే వేయాలి.

→  సినిమాను ముంబై బ్యాక్ డ్రాప్లో సెట్ చేసిన విధానం, రియలిస్టిక్ లొకేషన్లో షూట్ చేయడం బాగున్నాయి. ఈ అంశాలకు రెండో విజిల్ వేయొచ్చు.

→ సెకండాఫ్లో తండ్రి కూతుళ్ళ మధ్యలో నడిచే ఎమోషనల్ ట్రాక్, వాటి తాలూకు కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. మూడో విజిల్ ఈ అంశానికి వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
→  సినిమాను ఆసక్తికరంగానే మొదలుపెట్టిన వర్మ పోను పోను ముఖ్యంగా ద్వితీయార్థాన్ని అర్థంకాని విధంగా రీతిలో చేసి చిరాకు పుట్టించారు.

→  ఇక విలన్ అయితే సినిమాకు ఉపయోగపడకపోగా పెద్ద బలహీనంగా మారాడు. ఆయన ఏ కోశానా ఆకట్టుకునే నటనను కనబర్చలేకపోయాడు.

→  అసలు వర్మ సినిమాలంటే మంచి డ్రామా ఎంతో కొంత ఉంటుంది. కానీ ఈ సినిమాలో అసలు అలాంటి డ్రామానే కనబడలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
→  వర్మ ద్వితీయార్థాన్ని తెరకెక్కించిన విధానమే విసుగుతో కూసిన ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

సినిమా చూసిన నాగార్జున అభిమానికి, అతని స్నేహితుడికి మధ్యన జరుగుతున్న సంభాషణ.

మిస్టర్ ఎ : ఆఫీసర్.. ఎలా ఉందిరా ?
మిస్టర్ బి : మనం భయపడ్డట్టే జరిగింది.
మిస్టర్ ఎ : అంటే ఇది కూడ పోయినట్టేనా !
మిస్టర్ బి : అంతే. వర్మ ఇంకెప్పుడు మంచి సినిమా తీస్తాడో.

  •  
  •  
  •  
  •  

Comments